పెను వివాదంగా మారిన శ్మశాన వాటికలో ఇళ్లస్థలాలు కేటాయింపు

పెను వివాదంగా మారిన శ్మశాన వాటికలో ఇళ్లస్థలాలు కేటాయింపు

తూర్పుగోదావరి జిల్లారంగంపేట మండలం బాలవరంలో 2 ఎకరాల 20 గుంటల స్థలంలో శ్మశాన వాటిక ఉంది. గ్రామంలోని హిందువులు గత కొన్నేళ్లుగా దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. అయితే అధికార పార్టీ నాయకులు.. అధికారులు కలిసి ఈ శ్శశానం స్థలాన్ని ఖాళీ చేయాలని.. వేరే చోట స్థలమిప్పిస్తామంటూ హామీ ఇచ్చారు. ఇంకా ఎవరైనా మాట వినకపోతే అరెస్ట్‌ చేస్తామంటూ కొందరిపై కేసులు కూడా పెట్టారు.

అధికార పార్టీ నేతల బెదిరింపులతో బాలవరం గ్రామస్తులు, జిల్లా బీసీ సంఘాల నాయకులు కలిసి హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఇళ్ల స్థలాల ప్రక్రియ అక్కడ నిలిపివేయాలని మొదట బీసీలు స్టే తీసకున్నారు.

ప్రభుత్వం పేదలకు మంచి చేయాలని చూడాలి తప్ప.. ఇలా శ్మశాన వాటికను ఆక్రమించి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమనేది చాలా దారుణమైన పరిస్థితి అని జిల్లా బీసీ నాయకులు పెద్దింటి వెంకటేశ్వరావు ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో ఎప్పుడు ఇలాంటి దారుణమైన పరిస్థితులు చూడలేదంటున్నారు జిల్లా బీసీ నేతలు. తమ వర్గంపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బీసీ వ్యతిరేక విధానాలు మానుకోకపోతే రాష్ట్ర స్థాయి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ప్రస్తుతం శ్మశాన వాటికలో ఇళ్లస్థలాలు కేటాయింపు వ్యవహారం తూర్పుగోదావరి జిల్లాలో పెను వివాదం రేపింది. శ్మశాన వాటికలో ఇళ్లస్థలాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు చెప్పిన తరువాతైన అధికార పార్టీ తీరుల తీరు మారాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story