దివ్య హత్య కేసులో వీడిన మిస్టరీ.. గుండు గీసి, వాతలు పెట్టి..

విశాఖ జిల్లాలో దివ్య హత్య కేసు మిస్టరీ వీడింది. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. గుండు గీసి, కనుబొమ్మలను కత్తిరించి, వాతలు పెట్టి దివ్యను.. వసంత గ్యాంగ్‌ హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రెండు రోజుల క్రితం అక్కయ్యపాలెం చెక్కుడురాయి భవనం సమీపంలోని ఓ ఇంట్లో.. దివ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసుల దర్యాప్తులో హత్య కోణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

వసంత, ఆమె సొదరి ఇద్దరూ కలిసి.. దివ్య అందాన్ని అడ్డుపెట్టుకుని గత కొంత కాలంగా వ్యభిచారం నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే డబ్బుల పంపకాల్లో దివ్య, వసంత మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఎలాగైనా దివ్యను అంతమొందించాలని నిర్ణయించుకున్న వసంత.. పథకం ప్రకారం అక్కయ్యపాలెంలోని ఓ ఇంట్లో కిరాతకంగా దివ్యను హత్య చేసింది. నిందితురాలు వసంతతో పాటు ఆమె సోదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మంది కోసం గాలిస్తున్నారు. దివ్య స్వస్థలం తూర్పుగోదావరి జిల్లాగా పోలీసులు చెబుతున్నారు.

Recommended For You