డెహ్రాడూన్‌లో రెండ్రోజులు షట్ డౌన్

డెహ్రాడూన్‌లో రెండ్రోజులు షట్ డౌన్

కరోనా కట్టడికి ప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో కరోనా కట్టడికి వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. శని, ఆదివారాలు పూర్తిగా షట్ డౌన్ ప్రకటించాయి. నిత్యావసరాలు మినహా.. అన్నీ బంద్ చేశారు.

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు 48 గంటలు అన్ని బంద్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ సమయంలో సిటీ మొత్తం శానిటైజేషన్ చేస్తామని తెలిపారు. అత్యవసర సర్వీసులు మినహా.. మిగతా వారంతా ఇంట్లోనే ఉండాలని.. అలా చేస్తే.. కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని తెలిపారు. తిరిగి సోమవారం మార్కెట్లు తెరుచుకుంటాయని అధికారులు స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story