వ్యక్తిపై కత్తులతో దాడికి తెగబడిన దుండగులు

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఒక వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడడం కలకలం రేపింది. కొండమల్లేపల్లి సాగర్‌ రోడ్‌లో ఉన్న పెట్రోల్‌ బంక్‌ దగ్గర.. బాబూజీనగర్‌కు చెందిన యాదగిరి అనే వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు పట్టపగలే కత్తులతో దాడిచేశారు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలు కాగా.. దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాత కక్షలే ఈ దాడికి కారణమని భావిస్తున్నారు.

Recommended For You