అక్రమ కేసులతో ఆర్థిక మూలాలు దెబ్బ తీస్తున్నారు: చంద్రబాబు

అక్రమ కేసులతో ఆర్థిక మూలాలు దెబ్బ తీస్తున్నారు: చంద్రబాబు

అచ్చెన్నాయుడును ఒక టెర్రరిస్టులా అరెస్టు చేయడం దారుణమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు వచ్చిన బాబుకు జైళ్లశాఖ అధికారులు అనుమతి ఇవ్వడకపోవడంతో ఆస్పత్రి ముందు నిలబడి అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ చేసుకున్న అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్టుచేసి.. తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని బాబు ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం మందులు వేసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఎక్స్ రే తీసిన తర్వాత పరిస్థితిని బట్టి మరోసారి ఆపరేషన్ చేస్తామని వైద్యులు చెప్పారన్నారు.

అచ్చెన్నాయుడు కుటుంబం గత 38 ఏళ్లుగా పార్టీకోసం, ప్రజలకోసం కృషిచేస్తుందన్నారు చంద్రబాబునాయుడు. ప్రజలకోసం అహర్షిశలు కృషిచేస్తున్న కుటుంబాన్ని ఇలా వేధింపులకు గురిచేయడం సరైంది కాదన్నారు. అవినీతిని అసెంబ్లీలో ప్రశ్నించినందుకే అరెస్టులకు పాల్పడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. తప్పుడు రికార్డులతో అచ్చెన్నాయుడిని అరెస్టుచేశారని బాబు ఆరోపించారు.

ప్రభుత్వ అవినీతి మీద పోరాడుతుంటే సరిచేసుకోవాల్సింది పోయి.. అరెస్టులకు పాల్పడటం ఏంటని ప్రశ్నించారు చంద్రబాబునాయుడు. ప్రభుత్వ అరెస్టులు, దాడుల బాధితుల కోసం ఏకంగా పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. అక్రమ కేసులతో ఆర్ధిక మూలాల మీద దెబ్బతీస్తున్నారని బాబు మండిపడ్డారు. తప్పుడు కేసులతో నాయకులను భయబ్రాంతులకుగురిచేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు.

Tags

Read MoreRead Less
Next Story