బాలీవుడ్ లో బ్యాగ్రౌండ్ లేకపోతే కష్టం: శ్రద్ధాదాస్

బాలీవుడ్ లో బ్యాగ్రౌండ్ లేకపోతే కష్టం: శ్రద్ధాదాస్

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వస్తే ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో మాకు తెలుసు. అసలు ఎందుకొచ్చామా అని అనుకునే రోజులు కూడా ఉంటాయి అని ఇన్ స్టా గ్రామ్ లో వివరించింది నటి శ్రద్ధాదాస్. ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేని వారు బాలీవుడ్ లో ఎదగలేరని, అలాంటి వారు భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. బాలీవుడ్ లో నటిగా ఎదగాలనుకుంటే పార్టీలకు, పబ్ లకు వెళ్లాలి. బాంద్రాలోని జుహూలో ఉన్న ఖరీదైన క్లబ్ లకు వెళ్లి అక్కడి వారిని స్నేహితులుగా చేసుకోవాలి. లేకపోతే కష్టాలు ఎదురవుతాయి. వాటన్నింటినీ తట్టుకుని నిలబడాలి. దీంతో నటీనటులు భయంకరమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది.

పీఆర్ మేనేజర్లు కూడా మమ్మల్ని పార్టీలకు వెళ్లమనే సలహా ఇస్తారు. ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లు చాలా మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. దుస్తులు, షూస్, కార్లు, పీఆర్ ఖర్చు, స్టయిలిస్ట్, సెలూన్ ఖర్చు ఇలా ఒకటేమిటి చాలా ఉంటాయి. వాటన్నింటినీ భరించడానికి డబ్బు కావాలి. ఒక్కోసారి అసలేం చేస్తున్నాం.. ఎందుకొచ్చాం అనిపిస్తుంది. ఈ రంగుల ప్రప్రంచం బయటకి చూసినంత అందంగా ఉండదు.. నటీనటులు జీవితాలు అంతకంటే అందంగా ఉండవు' అంటూ శ్రద్ధ ఓ సుదీర్ఘమైన లేఖను పోస్ట్ చేసింది. సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story