తెలంగాణలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో 730 పాజిటివ్ కేసులు నమోదు

తెలంగాణలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో 730 పాజిటివ్ కేసులు నమోదు

తెలంగాణలో కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. పదుల నుంచి వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 730 పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 7వేల 802కు చేరింది. కరోనాతో మరో ఏడుగురు మరణించడంతో.... రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 210కి చేరింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఒక్కరోజులోనే 659 పాజిటివ్ కేసులు నమోదు కావడం వణుకుపుట్టిస్తోంది. 24గంటల్లో 225 మంది కరోనా బాధితులు ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో వైరస్ బారినుంచి కోలుకున్నవారిసంఖ్య 3వేల 731కి చేరింది. రాష్ట్రంలో 3వేల 861 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

కరోనా కేసులు జిల్లాలో ఇప్పటివరకు ఒకటి రెండు మాత్రమే నమోదయ్యేవి. లాక్ డౌన్ సడలించిన తర్వాత వాటి సంఖ్య పదులకు చేరుకుంది. దీంతో కరోనా వైరస్ గ్రామాల్లోను ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. జనగామ జిల్లాలో అత్యధికంగా 34 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువగా ఓ ఎరువుల షాపులో పనిచేసిన వారి లింకులే ఉన్నాయి.రంగారెడ్డిలో 10, మేడ్చల్‌లో 9, ఆసీఫాబాద్‌లో 3, సంగారెడ్డి, ఆదిలాబాద్, కొత్తగూడెం, నారాయణపేట, మెదక్, నల్గొండ, వికారాబాద్, వరంగల్, యాదాద్రిలో ఒక్కో పాజిటివ్ కేసు నమోదు అయ్యాయి.

రాష్ట్రంలో కరోనా వైరస్ సామాన్యులతోపాటు ప్రముఖులకు సోకింది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యలే దీనిబారిన పడ్డారు. పలువురు ఎమ్మెల్యేలు సహాయకులు, డ్రైవర్లు, ఓ మాజీ రాజ్యసభ సభ్యుడు మహమ్మారి బారినపడ్డారు. వందలాదిమంది పోలీసులు, వైద్యసిబ్బందికి కరోనా సోకింది. పెద్దసంఖ్యలో పారిశుద్ద్య కార్మికులు, జర్నలిస్టులకు కోవిడ్ సోకింది.

Tags

Read MoreRead Less
Next Story