ఆన్ లైన్ లో గ్రేడ్స్.. పది పరీక్షా ఫలితాలు

ఆన్ లైన్ లో గ్రేడ్స్.. పది పరీక్షా ఫలితాలు

కరోనా వైరస్ కారణంగా పదవతరగతి విద్యార్థుల పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. విద్యార్ధులందరినీ ఉత్తీర్ణులను చేశారు. ఇంటర్నల్ అసెస్ మెంట్ మార్కుల ప్రాతిపదికన గ్రేడ్ లను నిర్ణయించింది విద్యాశాఖ. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం సాయింత్రం 3 గంటల నుంచి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు. విద్యార్ధులు తమ గ్రేడ్ వివరాలను www.bse.telangana.gov.in వెబ్ సైట్ లో పొందవచ్చని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులకు సంబంధించిన పాస్ మెమోలను సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారా పొందవచ్చని మంత్రి తెలిపారు. విద్యార్థుల పాస్ మెమో వివరాల్లో ఏవైనా పొరపాట్లు తలెత్తిత్తే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారా ఎస్ ఎస్సీ బోర్డుకు పంపించి సరిచేయిస్తారని మంత్రి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story