కొరియోగ్రాఫర్ కి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ తీవ్ర అనారోగ్యంతో ముంబైలోని గురునానక్ ఆస్పత్రిలో చేరారు. 71 ఏళ్ల సరోజ్ ఖాన్ గత కొంత కాలంగా శ్వాస కోశ సమస్యలతో బాధపడుతున్నారు. ముంబైలో కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఆమెకు వైద్యులు కరోనా టెస్ట్ చేయడగా నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. చికిత్సానంతరం ఆమె కోలుకున్నారని కుటుంబసభ్యులు వివరించారు. మూడు రోజుల అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.
కాగా, నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నారు సరోజ్ ఖాన్. సుమారు 2 వేల సినిమా పాటలకు నృత్య దర్శకత్వం అందించారు. కాగా, దేవదాస్ సినిమాలోని దోలా రే దోలా.. తేజాబ్ లో ఏక్ దో తీన్.. జబ్ వీ మెట్ సినిమాలోని యే ఇష్క్ హై పాటలకు గాను ఆమెకు జాతీయ అవార్డులు తెచ్చిపెట్టాయి.

Recommended For You