250 మంది అతిధులను పిలిచి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న డీఎంకే నాయకుడు.. కరోనా పాజిటివ్

250 మంది అతిధులను పిలిచి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న డీఎంకే నాయకుడు.. కరోనా పాజిటివ్

లాక్టౌన్ నిబంధనలను ఖాతరు చేసి కన్నంబక్కంలోని మామిడి తోటలో ఈనెల 14న 250 మంది అతిధులను పిలిచి ఘనంగా 50వ పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నారు డీఎంకే నాయకుడు గుణశేఖరన్. అతని భార్య కూడా వేడుకలకు హాజరై బిర్యానీ వండి వడ్డించారు అతిధులందరికీ. కరోనా భయం ఏమాత్రం కనిపించలేదు.. ఒక్కరూ మాస్కులు ధరించలేదని, సామాజిక దూరాన్ని పాటించలేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. వేడుకకు వచ్చిన అతిధులంత గుణశేఖరన్ తో సెల్ఫీలు దిగారు. వేడుకలు ముగిసిన వారం రోజుల అనంతరం కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నారు గుణశేఖరన్. ఆయనతో పాటు మరో నలుగురికి పాజిటివ్ వచ్చింది. దాంతో మిగిలిన వారిని వెతికే పనిలో పడ్డారు పోలీసులు. 60 మందిని గుర్తించి వారి వాహనాలను సీజ్ చేశారు. మిగిలిన వారు మరెంత మందికి అంటించి వుంటారో అని ఆందోళన చెందుతున్నారు అధికారులు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన డీఎంకే నాయకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పుట్టిన రోజు వేడుకకు హాజరైన వారిలో రాజకీయ నాయకులు, పంచాయితీ బోర్డు అధ్యక్షులు, కౌన్సిలర్లు, ప్రభుత్వ సిబ్బంది హాజరయ్యారు. వారందరూ కరోనా టెస్ట్ చేయించుకుంటున్నారు. మరి ఎంత మందికి పాజిటివ్ వచ్చిందనేది తెలియాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story