పరిస్థితి అదుపులో ఉంది : కర్నూల్ కలెక్టర్

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల్ పట్టణంలోని ఎస్పీవై ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో మేనేజర్ మరణించాడు. మరో ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో వారిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం 5 మంది ఉన్నారని తెలుస్తోంది.

సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు, వైద్య, ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఈ‌ ఘటనపై జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ స్పందించారు. కంపెనీ లోపల మాత్రమే గ్యాస్‌ లీకైందని, బయట గ్యాస్‌ లీక్‌ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉందని అన్నారు.

Recommended For You