సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన మెరుపులు

ఆకాశంలో మెరుపులు రావడం సహజమే. అయితే ఆకాశంలో గతేడాది వచ్చిన మెరుపులు ఓ కొత్త రికార్డు సృష్టించాయి. అర్జెంటీనా, బ్రెజిల్‌లో వచ్చిన రెండు మెరుపులు.. క్రియేట్ చేసిన కొత్త రికార్డులను ప్రపంచ వాతావరణ సంస్థ రిలీజ్ చేసింది. అత్యంత పొడువైన మెరుపు.. బ్రెజిల్‌లో సంభవించినట్లు ఆ సంస్థ తెలిపింది. ఆ మెరుపు నుంచి వెలుబడిన మెగాఫ్లాష్.. సుమారు 700 కి.మీ దూరం ఉన్నట్లుగా ప్రపంచ వాతావరణ సంస్థ అంచనా వేసింది.
గతేడాది అక్టోబర్ 31న దక్షిణ బ్రెజిల్‌లో ఈ మెరుపు కనిపించిందని ప్రకటించింది. వాషింగ్టన్ డీసీ నుంచి బోస్టన్‌కు ఎంత దూరం ఉంటుందో.. ఆ మెరుపు పొడుగు అంత ఉంటుందని ఆ సంస్థ వెల్లడించింది. ఇక అర్జెంటినాలో 2019, మార్చి 4న ఓ మెరుపు దాదాపు 16.73 సెకన్ల పాటు ఆకాశంలో కనిపించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మెరుపులు అసాధారణ రికార్డులను నెలకొల్పినట్లు WMO నిపుణులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com