వాలంటీర్‌‌కు రాజీనామా చేయాలని వార్నింగ్ ఇచ్చిన వైసీపీ నేత

వాలంటీర్‌‌కు రాజీనామా చేయాలని వార్నింగ్ ఇచ్చిన వైసీపీ నేత

అనంతపురం జిల్లాలో వాలంటీర్‌ సోదరుడిని బెదిరించాడు ఓ వైసీపీ నేత. తాడిపత్రి నియోజకవర్గం జూటూర్ వాలంటీర్‌ సోదరుడిని వైసీపీ నేత వినయ్‌ కుమార్‌ రెడ్డి వార్నింగ్‌ ఇచ్చాడు. సోదరునితో రాజీనామా చేయించాలంటూ అసభ్యపజాలతో దూషించాడు. కులం పేరుతో దుర్భాషలాడాడు. దీంతో వినయ్‌కుమార్‌రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అతనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ఈ సందర్భంగా ఎస్సైని కూడా వినయ్‌కుమార్‌ రెడ్డి దూషించడం విశేషం. ఎస్సీ, ఎస్టీ కేసు వెనక్కి తీసుకోవాలని దౌర్జన్యం చేస్తున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story