ఏపీలో 108 ఉద్యోగుల సమ్మెబాట

ఆంధ్రప్రదేశ్ లో 108 సిబ్బంది సమ్మె బాట పట్టనున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ వారు ఏపీ ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని 108 ఉద్యుగుల అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈనెల 24వ తారీఖున ఆరోగ్యశ్రీ సీఈఓకు సమ్మె నోటీసు ఇచ్చినట్టు అసోసియేషన్ తెలిపింది.

ముఖ్యమంత్రి సమక్షంలోనే 108 ఉద్యుగుల సమస్యలపై చర్చలు జరిగి, ముఖ్యమంత్రే ఆదేశాలు ఇచ్చినా ఏడునెలల అయినా అధికారులు పట్టించుకోలేదని అన్నారు. ఇటువంటి పరిస్థితులలో నోటీసు ఇవ్వాలని ఉద్యోగులెవ్వరూ అనుకోలేదని అనివార్యపరిస్థితికి తాము నెట్టబడ్డామని అన్నారు. దీనిపై గత ఏడూ నెలలుగా అధికారులను కలిసినా లాభం లేకుండా పోయిందని అందువల్లే నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు.

Recommended For You