ప్రభుత్వ కార్యాలయాలకు జగన్ బొమ్మ ఉండాల్సిందేనట

ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు,సుప్రీంకోర్టులు అభ్యంతరం తెలిపిన సంగత్ తెలిసిందే. దీంతో రంగులను మార్చాలని జగన్‌ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది. అన్ని కార్యాలయాలకు తెలుపు రంగు మాత్రమే ఉండేలా ఆదేశాలు ఇచ్చింది. భవనాలపై ఉన్న నీలం, ఆకుపచ్చ రంగుల్ని వెంటనే తొలగించాలని ఆదేశాల్లో పేర్కొంది. దాంతో అన్ని కార్యాలయాకు వేసిన రంగులను తొలగిస్తుంది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఫోటోను మాత్రం మాత్రం అలాగే ఉంచుతున్నారు. కాగా, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై పలువురు ప్రజాస్వామ్యవాదులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Recommended For You