ఏపీలో ఆదివారం రికార్డు స్థాయిలో కేసులు

ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం రికార్డు స్థాయిలో కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో మొత్తం 25 వేల 778 శాంపిల్స్ ను పరీక్షించగా 758 మందికి కరోనా నిర్ధారణ అయింది. కొత్తగా 401 మంది కోలుకోవడంతో వారిని డిశ్చార్జ్ చేశారు. ఇక కొత్తగా కర్నూల్ లో ఆరుగురు, కృష్ణలో ఐదుగురు, పశ్చిమ గోదావరిలో ఒకరు కోవిడ్ భారిన పడి మరణించారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 10,848 పాజిటివ్ కేసులకు గాను 4685 మంది డిశ్చార్జ్ కాగా 169 మంది మరణించారు , ప్రస్తుతం 5994 చికిత్స పొందుతున్నారు.

Recommended For You