ఇళ్ల స్థలాల కోసం పేదల గుడిసెలు కూల్చివేత

కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో ఇళ్ల పట్టాలు ఉన్నప్పటికీ పేదల గుడిసెలను అధికారులు కూల్చివేశారు. దీంతో బాధితులు మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. శివన్న నగర్ లో పర్యటించించిన జయనాగేశ్వరరెడ్డి అక్కడ పరిస్థితిని కళ్లారా చూశారు. తమ ఇళ్ళు తమకు ఇప్పించాలని బీవీ కాళ్లుపట్టుకొని మహిళలు విలపించారు.

వైసీపీ వర్గీయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి తమ గుడిసెలు కూల్చివెయ్యటం ఏమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ గత టీడీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేసింది. ఇప్పుడు మాత్రం పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ ప్రభుత్వం పేదల గుడిసెల్ని కూల్చివేసింది. మరోవైపు అధైర్యపడకుండా పోరాడుతున్నామని బాధితులకు భరోసా ఇచ్చారు జయనాగేశ్వరరెడ్డి.

Recommended For You