మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు మంత్రి కేటీఆర్‌ నివాళి

భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞాపభూమిలో ప్రధాన కార్యక్రమం జరుగనుంది. ఆదివారం ఉదయం 10.30 గంటలకు పీవీ శత జయంతి ఉత్సవాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

పీవీ శతజయంతి సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్‌ పీవీకి నివాళర్పించారు. ‘తెలంగాణ భూమి పుత్రుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు.. వారు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు ‘ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

 


Recommended For You