పీవీ తెలివైన రాజకీయవేత్త : సీఎం‌ జగన్‌

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పీవీకి నివాళులర్పించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. దివంగత ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ప్రస్తుతం మన మధ్య లేకపోయినా ఆయన సేవలు మాత్రం ఎప్పటికి గుర్తుండిపోతాయని అన్నారు. ఆయన ఒక తెలివైన రాజకీయవేత్త అని రాజనీతిజ్ఞులు, బహుభాషా పండితుడని అన్నారు.

దేశంలో ఆర్థిక పరిస్థితి ననాటికి౯ దిగజారిపోతోన్న సమయంలో ప్రధాని పదవి చేపట్టిన పీవీ.. ఆర్ధిక రంగంలో ఎన్నో గొప్ప సంస్కరణలకు శ్రీకారం చుట్టారని అన్నారు. దేశాన్ని ఆర్ధిక సరళీకరణ వైపు పరుగులు పెట్టించారని కొనియాడారు. దేశ అభివృద్ధికి పీవీ నరసింహారావు చేసిన ఎనలేని కృషిని భవిష్యత్తు తరం కూడా గుర్తుంచుకుంటారని ట్విట్టర్ లో పేర్కొన్నారు జగన్.

Recommended For You