దేశవ్యాప్తంగా ఒక్కరోజే 19459 కరోనా పాజిటివ్‌ కేసులు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా కరోనా తీవ్ర ప్రభావం చూపటంతో.. ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ప్రతిరోజు రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.

గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,459 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి ఒకేరోజులోనే 380 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,48,318కి చేరింది. కరోనా కారణంగా ఇప్పటి వరకు 16,475 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 2,10,120 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ వైరస్‌ బారినపడినవారిలో ఇప్పటివరకు 3,21,273 మంది బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.

Recommended For You