ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం..

ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య మధ్యప్రదేశ్‌ నుంచి ఉత్తర మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి ఇంకా కొనసాగుతోంది. ఉత్తరమధ్య కర్ణాటక పరిసరాల్లోనూ ఉపరితల ఆవర్తనం నెలకొంది. వీటి ప్రభావంతో ఆదివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి.

ఇక శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడ్డాయి. సోమ, మంగళవారాల్లో ఉత్తరాంధ్రలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణకోస్తాలో ఓ మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. రాయలసీమలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Recommended For You