తెలంగాణలో కొత్తగా 1000 కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. ప్రతీ రోజు సుమారు వెయ్యి వరకూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో అధికార యంత్రాంగం, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గడిచిన 24గంటల్లో 938 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులుతో మొత్తం బాధితుల సంఖ్య 14,419కి చేరింది. ఈ రోజు నలుగురు కరోనా తో మృతి చెందారని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హెల్త్ బులిటెన్ ద్వారా తెలిపారు. ఇప్పటి వరకూ కరోనా మహమ్మారి 247 మందిని బలితీసుకుంది. కరోనా నుంచి కోలుకొని మొత్తం 5,172 మంది డిశ్చార్జ్ అవ్వగా.. ఇంకా తొమ్మిది వేల మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఎక్కవ కేసులు జీహెచ్ఎంసీ పరిదిలో నమోదవ్వడంతో హైదరాబాద్ లో మరోసారి లాక్ డౌన్ విధించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది.

Recommended For You