పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ భనవంపై ఉగ్రదాడి

పాకిస్తాన్ లో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. కరాచీలోని స్టాక్ మార్కెట్ భవనంలోకి చొరబడి కాల్పులు జరపడంతో ఇద్దరు పౌరులు మృతి చెందారు. ఈ దాడిలో పలువురికి తీవ్రగాయలు అయ్యాయి. అయితే, అప్పటికే అప్రమత్తమైన భద్రతా బలగాలు ప్రతిదాడులు చేసి ముగ్గురు తీవ్రవాదులను మట్టబెట్టారు. మరో తీవ్రవాది భవనం లోపల ఉన్నాడని తెలియడంతో.. ఆ భవనం మొత్తం ఖాళీ చేపించారు. ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ప్రాంతంలో ఎక్కవగా బ్యాంకులు, ఆఫీసులు ఉండటంతో పోలీసులు భద్రతను పెంచారు. అయితే, ఉగ్రదాడి నేపథ్యంలో చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఇంకా ఉన్నారేమోననే అనుమానం వ్యక్తం కావటంతో పాక్ సైన్యం గాలింపు చర్యలు చేపట్టారు.

Recommended For You