ఏపీలో కందిపప్పుపై రూ. 27 , చెక్కరపై 7 పెంపు..

ఆంధ్రప్రదేశ్ చౌక దరల దుకాణాల ద్వారా పంపిణీచేసే సరుకుల ధరలను పెంచింది. చెక్కర, కందిపప్పు రేట్లు పెంచడంపై రాషందారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకూ కేజీ కందిపప్పు 40 రూపాయలు ఉండగా దీనిని 67 కు పెంచారు.అలాగే చెక్కర కేజీ పది రూపాయలు ఉండగా దీనిని కూడా 17 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అయితే రాయితీ సరుకుల ధరలను పెంచడంపై రేషన్ కార్డుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ కాలంలో ధరలు పెంచడం సరికాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఒకచేత్తో ఇచ్చినట్టే ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

Recommended For You