అమెజాన్ ఉద్యోగులకు వైరస్.. పట్టించుకోని యాజమాన్యం..

ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఉద్యోగులు మహమ్మారి కోరల్లో చిక్కుకుని ప్రాణాలతో పోరాడుతున్నారు. కరోనా సోకిన తమ సహచరులను యాజమాన్యం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని జర్మనీలోని అమెజాన్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సంస్థలోని పలు కార్యాలయాలకు చెందిన 30-40 మంది వైరస్ బారిన పడ్డారని, వారికి సంస్థ నుంచి ఎలాంటి సహాయం అందలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్థానికంగా ఉన్న 6 అమెజాన్ కార్యాలయాల్లోని ఉద్యోగులు ధర్నా చేయలనున్నట్లు యూనియన్ సిబ్బంది ప్రకటించారు. సంస్థ కేవలం లాభాపేక్ష ఆశిస్తోంది కానీ ఉద్యోగుల క్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ దర్నా రెండు రోజులు కొనసాగుతుందని చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు సంస్థ అండగా నిలవాలని కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com