ఏపీలో కరోనా విజృంభణ.. కొత్తగా 704 కేసులు

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 704 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 14595కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో రాష్ట్రంలో 648 మంది కాగా.. 51 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు. అటు, విదేశాలనుంచి వచ్చిన వారికి ఐదుగురుకి సోకింది. ఇప్పటి వరకూ 6161 మంది కరోనా నుంచి కోలుకోగా.. 7897మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. ఈ రోజు కరోనాతో ఏడుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకూ 187 మంది కరోనాకు బలైపోయారు.

Recommended For You