చైనా యాప్ లకు చెల్లు.. ఈ యాప్స్ తో భర్తీ..

చైనా యాప్ లకు చెల్లు.. ఈ యాప్స్ తో భర్తీ..

సరిహద్దుల్లో చైనాతో సమరం.. అసువులు బాసిన భారత సైనికులు.. ఆగ్రహంతో ఊగిపోయిన స్వదేశీయులు.. చైనాతో కటీఫ్.. చైనా వస్తువులు బ్యాన్.. అంటూ నినాదాలు. ఈ నేపథ్యంలో కేంద్రం చైనా యాప్ లను బ్యాన్ చేసింది. దాదాపు 59 చైనా యాప్ లపై నిషేధం విధించింది. నిన్నటి వరకు చైనా యాప్ లతో కాలక్షేపం చేసి ఈ రోజు ఖాళీగా కూర్చోవాలంటే ఎలా అని అనుకోవక్కర్లేదు.. ప్రత్యామ్నాయ యాప్ లు చాలా ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్ధాం.

ఫోటోలు, వీడియోలు, యాప్స్ ఇతరులకు కనిపించకుండా ఇప్పటి వరకు యాప్ లాక్.. వాల్డ్ వాడేవారు. ఇప్పుడు వాటికి బదులు స్మార్ట్ యాప్ లాకర్, లాక్ యాప్-ఫింగర్ ఫ్రింట్, కీప్ సేఫ్, నొర్టన్ యాప్ లాక్, లాక్ మై పిక్స్ సీక్రెట్ ఫోటో వాల్డ్ తదితర యాప్స్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే సరిపోతుంది.

వార్తలు, ఫొటోలు, వీడియోలు.. ఇలా ఏది కావాలన్నా నెట్టింట్లో వెతుకుతుంటాం. చాలా మొబైల్ లో యూసీ బ్రౌజర్ ను డీఫాల్ట్ ఇవ్వడం, సూచించడం లాంటివి చేస్తుండడంతో అదే ఎక్కువగా వాడుతున్నారు. దీన్ని డిలీట్ చేసినా గూగుల్ క్రోమ్, ఒపేరా, మొజిల్లా, ఫైర్ ఫాక్స్ లాంటి బ్రౌజర్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఇప్పటి వరకు డాక్యుమెంట్లు, ఫోటోలను స్కాన్ చేయాలంటే క్యామ్ స్కానర్ యాప్ వాడేవాళ్లం. ఇకపై అడొబ్ స్కాన్, మైక్రోసాప్ట్ లెన్స్, ఫోటో స్కాన్ బై గూగుల్ లాంటి యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. వీటితో పాటు భారత్ లో రూపొందించిన డాక్ స్కానర్, పీడీఎఫ్ క్రియేటర్, డాక్యుమెంట్ స్కానర్-పీడీఎఫ్ క్రియేటర్ ను ప్రయత్నించొచ్చు.

ఫోటోలకు అందంగా మెరుగులు దిద్దడం కోసం మీరు వాడే యూక్యామ్, బ్యూటీ క్యామ్, బ్యూటీ ప్లస్ యాప్ బదులు పిక్స్ ఆర్ట్, అడొబ్, ఫోటోషాప్, లైట్ రూమ్, గూగుల్ స్నాప్ సీడ్, బీ612 యాప్స్ ను ప్రయత్నించొచ్చు.

వీడియోలను ఎడిట్ చేసేందుకు వైవా వీడియో, వైవా కట్, ఫిల్మోరా వంటి యాప్స్ బదులు కైన్ మాస్టర్, అడొబ్ ప్రిమియర్ క్లిప్, మ్యాజిస్టో యాప్స్ వాడుకోవచ్చు.

కాన్ఫరెన్స్ అంటే జూమ్ యాప్.. భద్రతా పరంగా భారత్ వీటిని వాడొద్దని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో గూగుల్ మీట్, స్కైప్, మైక్రోసాప్ట్ టీమ్స్, గూగుల్ డుయో, వాట్సాప్ కాల్ లాంటివి వాడుకోవచ్చు. అలాగే సే నమస్తే యాప్ కూడా ప్రయత్నించొచ్చు.

అలాగే అత్యంత పాపులారిటీ సంపాదించుకున్న టిక్ టాక్, విగో వీడియో, లైక్, హలో యాప్ బదులు రొపొసొ, డబ్ స్మాష్, పెరిస్కోప్ వంటి వాటిని ప్రయత్నించొచ్చు.

ఫైల్స్ పంపేందుకు వాడుతున్న షేర్ ఇట్, జెండర్ యాప్స్ ను అన్ ఇన్ స్టాల్ చేసి వాటి స్థానంలో షేర్ ఫైల్స్, ఫైల్స్ బై గూగుల్ ను వినియోగించవచ్చు.

మీ మొబైల్ లో వైరస్ ప్రవేశించకుండా ఉండేదుకు సెక్యూరిటీ యాప్ ఏవీజీ, అవాస్టా, నార్తన్ యాంటీ వైరస్ వంటి యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మొబైల్ లో టైప్ చేసేందుకు గాను వాడుతున్న గో కీబోర్డు యాప్ బదులు గూగుల్ ఇండిక్ కీబోర్డు, గింగర్ కీబోర్డు, జీ బోర్డ్, మైక్రోసాప్ట్ స్విప్ట్ కీబోర్డు వాడవచ్చు.

ఇతర భాషల్లోని పదాల అర్ధాలు తెలుసుకునేందుకు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ యాప్, గూగుల్ ట్రాన్స్ లేట్ వంటి యాప్ లను వాడొచ్చు.

Tags

Read MoreRead Less
Next Story