దేశవ్యాప్తంగా కరోనాతో ఒక్కరోజే 418 మంది మృతి

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంట‌ల్లో దేశంలో 18522 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ వెల్ల‌డించింది.

ఒక్క రోజులోనే దేశంలో కరోనా మహమ్మారి బారిన పడి 418 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 5,668,40గా ఉన్న‌ది. దీంట్లో 2,15,125 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 3,34,822 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. దేశ‌వ్యాప్తంగా కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 16,893గా ఉన్న‌ట్లు ఆరోగ్య‌శాఖ పేర్కొంది.

Recommended For You