మరో టీఆర్ఎస్ నాయకుడికి కరోనా.. హరితహారంలో చురుగ్గా..

మరో టీఆర్ఎస్ నాయకుడికి కరోనా.. హరితహారంలో చురుగ్గా..

వైరస్ బారిన పడుతున్న నాయకుల సంఖ్య కూడా ఎక్కువవుతోంది. తాజాగా కరీంనగర్ కు చెందిన ప్రముఖ టీఆర్ఎస్ నాయకుడికి కరోనా వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ఆయనను వెంటనే పార్టీ నాయకులు హైదరాబాదులోని కార్పొరేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. నాయకుడికి కుటుంబసభ్యులను హోం క్వారంటైన్ లో ఉంచారు. కరోనా సోకిన నాయకుడు ఈ నెల 25న జరిగిన హరిత హారం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. నాయకుడికి కరోనా సోకడంతో అందులో పాల్గొన్న మరెంత మంది అధికారులకు, ప్రజా ప్రతినిధులకు కరోనా సోకి ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు.

కాగా, కరీంనగర్ సప్తగిరి కాలనీలోని ఒక రిటైర్డు ఆర్టీసీ ఉద్యోగికి కరోనా సోకింది. శర్మ నగర్ కు చెందిన ఓ మహిళకు, జమ్మికుంట పట్టణానికి చెందిన ఒక డాక్టర్ భార్యకు కరోనా సోకింది. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్త పల్లిలో ఒక రైసు మిల్లు వ్యాపారికి వైరస్ సోకింది. ఆయన నిత్యం రైసు మిల్లు పనులకు సంబంధించి వరంగల్ వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలో ఆయనకు వైరస్ సోకి వుండవచ్చని అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 98 మందికి వైరస్ సోకింది. ఇందులో అయిదుగురు మృతి చెందారు. మిగిలిన వారు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story