ఒక్కరోజులో మరో 53 మంది జవాన్లకు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతుండటంతో.. ప్రజలు ఆందోళనకు గురవతున్నారు. ఇక ఈ కరోనా మహమ్మారితో భారత జవాన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇప్పటికే సీఆర్పీఎఫ్, ఆర్మీ, సీఐఎస్‌ఎఫ్ వంటి భద్రతా దళాల్లోని అనేక మంది జవాన్లు కరోనా బారినపడ్డారు. గడచిన 24 గంటల్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) కు చెందిన మరో 53 మందికి కరోనా వైరస్ సోకిందని బీఎస్‌ఎఫ్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

Recommended For You