తెలంగాణలో కరోనా కలకలం.. కొత్తగా 975 కేసులు

తెలంగాణలో కరోనా కలకలం రేపుతోంది. ప్రతీ రోజు కొత్తగా రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ రోజు 975 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 15,394కి కరోనా కేసులు చేరాయి. అటు, ఈరోజు కరోనాతో ఆరుగురు మృతి చెందారు. తాజాగా నమోదైన మరణాలతో మొత్తం రాష్ట్రంలో 253 కరోనా మరణాలు సంభవించాయి. 5,582 మంది కలుకొని డిశ్చార్జ్‌ అవ్వగా.. 9,559 చికిత్స పొందుతున్నారు. ప్రతీరోజు విపరీతంగా కరోనా కేసులు పెరగడంతో మొత్తం జీహెచ్ఎంసీ పరిదిలో లాక్ డౌన్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Recommended For You