సర్కారు నిర్ణయం.. ఎంట్రన్స్ పరీక్షలన్నీ వాయిదా..

రాష్ట్రంలో అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా నేపథ్యంలో ఎంట్రన్స్ టెస్ట్‌లన్నీ వాయిదా వేయాలని ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మహమ్మారి వ్యాప్తి విస్తృతంగా ఉన్న తరుణంలో అందరూ కరోనాతో యుద్ధం చేయడమే. ప్రస్తుత పరిస్థితిలో పరీక్షలు నిర్వహిస్తే రిస్క్ కొని తెచ్చుకున్న వారమవుతామని వాయిదా వేసింది ప్రభుత్వం. అసలైతే రేపటి నుంచి జూలై నెల 15 వరకు కామన్ ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి షెడ్యూల్ ఖరారు చేసింది కాగా ప్రభుత్వ నిర్ణయంతో పరీక్షలు వాయిదా పడ్డాయి.

Recommended For You