వైజాగ్‌లో మళ్లీ గ్యాస్ లీక్ ఘటన

విశాఖ ఎల్జి పాలిమర్స్ ఘటన మరువకముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది. పరవాడ ఫార్మాసిటీలో సాయినార్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ కంపెనీలో విషవాయువు లీక్ అయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. అర్థరాత్రి దాటక రియాక్టర్ నుంచి విష వాయువులు లీక్ కావడంతో.. కంపెనీలో షిఫ్ట్ ఇన్ చార్జ్, కెమిస్ట్ మృతి చెందారు.

మృతి చెందిన వారిని కేజీఎచ్‌కు తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురిని గాజువాక ఆసుపత్రికి తరలించారు. పరవాడలోని ప్రమాద ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, నగర పోలీసు కమిషనర్ ఆర్కె మీనా పరిశీలించారు.

Recommended For You