దారుణం.. మాస్క్ పెట్టుకోలేదని అడిగినందుకు మహిళా ఉద్యోగిపై డిప్యూటీ మేనేజర్..

మాస్క్ పెట్టుకోలేదేమని అడిగినందుకు డిప్యూటీ మేనేజర్ కి పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. హోదాను మరిచి ఓ మహిళా ఉద్యోగిని ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. అడ్డుకోబోయిన తోటి ఉద్యోగుల మీద కూడా దాడి చేశాడు. నెల్లూరు ఏపీ టూరిజం హోటల్ కార్యాలయంలో కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగిపై డిప్యూటీ మేనేజర్ భాస్కర్ ఇనుప రాడ్దుతో దాడి చేశాడు. కరోనా నేపథ్యంలో మాస్క తప్పనిసరిగా ధరించాలని వైద్యులు పదే పదే చెబుతున్నారు. అయినా సదరు మేనేజరు మాస్క్ పెట్టుకోలేదు. అదే విషయం మహిళా ఉద్యోగి అడిగింది. అంతే అయ్యవారికి తిక్క రేగింది. ఆమెను కూర్చీలో నుంచి కిందకి లాగి మరీ కొట్టాడు. ఆయన చేసిన ఘనకార్యమంతా సీసీటీవీలో రికార్డయింది. మేనేజర్ ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో అర్థమవుతోంది అని తోటి ఉద్యోగులు భయపడిపోతున్నారు. ఆఫీసుకి రావాలంటేనే హడలి పోతున్నారు. ఈ మేరకు మహిళా ఉద్యోగి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు డిప్యూటీ మేనేజర్ భాస్కర్ ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించిన అధికారులు చర్యలకు సిఫార్సు చేశారు.

Recommended For You