అర్నబ్ గోస్వామికి కాస్త ఉపశమనం

రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్ గోస్వామికి బోంబే హైకోర్టు కాస్త ఉపశమనం కల్పించింది. పలు కేసుల్లో ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను సస్పెండ్ చేసింది. పాల్‌ఘర్ లో సాధువుల హత్య, ముంబైలో వలస కూలీలు కరోనా సమయంలో మూకుమ్మడిగా ఒకే చోట చేరడంపై ఆయన రిపబ్లిక్ టీవీలో డిబెట్ పెట్టి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారని ఆయనపై కేసులు నమోదయ్యాయి. అయితే, తనపై ఏప్రిల్ 22, మే 2న దాఖలైన ఎఫ్ఐఆర్‌లను రద్దు చేయాలని అర్నాబ్ హైకోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. అర్నబ్  నేరం చేసినట్టు విచారణలో తేలలేదని.. ఆయనపై నిర్భంధ చర్యలు తీసుకోరాదని తేల్చింది. ప్రజల్లో అశాంతి ఏర్పడేలా ఆయన ప్రయత్నించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్ఫష్టం చేసింది.

 

 

 

Recommended For You