టిక్‌టాక్ తో చాలా మందికి ఉపాధి.. నిషేధం విధిస్తే.. : టిక్‌టాక్ ఇండియా చీఫ్

హడావిడిగా తీసుకున్న నిర్ణయనుకోవాలో లేక ఆలోచించే నిర్ణయం తీసుకుందనుకోవాలో అర్థం కాని పరిస్థితి. టిక్‌టాక్ సహా 59 చైనా యాప్స్ ని నిషేధిస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో టిక్‌టాక్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. వినియోగ దారుల భద్రత గురించి భయపడాల్సిన అవసరమే లేదని భారతీయ చట్టాలకు లోబడే సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని పేర్కొంది. భారతీయ వినియోగదారుల సమాచారాన్ని విదేశీ ప్రభుత్వాలతో పంచుకోలేదని స్పష్టం చేసింది. చైనాకు తాము ఎలాంటి సమాచారం అందజేయమని వివరణ ఇచ్చింది. భవిష్యత్తులో సమాచారం కోరినా అందజేసే ప్రసక్తి లేదని పేర్కొంది.
యాప్ నకు సంబంధించిన వివరాలు తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందిందని టిక్‌టాక్ ఇండియా చీఫ్ నిఖిల్ గాంధీ తెలిపారు. త్వరలో కేంద్రానికి వివరణలతో కూడిన నివేదిక సమర్పిస్తామని పేర్కొంది. ఇకపోతే టిక్‌టాక్ ని భారతీయులకు మరింత చేరువ చేసేందుకు 14 భాషల్లోకి మార్చామన్నారు. ఇప్పటికే భారతీయుల్లో భాగమై పోయిన టిక్‌టాక్ ద్వారా చాలా మంది ఉపాధి పొందుతున్నారని అన్నారు. టిక్‌టాక్ పై నిషేధం విధిస్తే వారంతా సమస్యలు ఎదుర్కుంటారని ఆయన అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com