బీహార్‌లో పిడుగు పడి 11మంది మృతి

బీహార్ లో తరుచూ పిడుగు పడి చాలా మంది మ‌ృతి చెందుతున్నారు. ఇటీవల పిడుగు పాటుకు గురై 83 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, మరోసారి తాజాగా పిడుగు పడి 11 మంది మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మృతి చెందిన కుటుంబాలకు నాలుగు లక్షల ఆర్థిక సాయం అందించారు. ఓ వైపు కరోనా.. మరోవైపు వరుస పిడుగులు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.

Recommended For You