పదవతరగతి విద్యార్థి ఇంట్లో కూర్చుని..

ఎప్పుడూ ఆ టీవీ లేదంటే ఫోన్.. ఈ రెండేనా.. ఆన్ లైన్ క్లాసులో చెప్పింది కాసేపైనా రిఫర్ చేసుకోవచ్చుగా.. ప్రతి ఇంట్లో రోజూ ఉండే సీన్ ఇది. కానీ ఢిల్లీకి చెందిన పదవతరగతి విద్యార్థి జారెబ్ వర్దన్ ఆలోచనలు మాత్రం ప్రస్తుతం కొవిడ్ మహమ్మారి నుంచి విధులు నిర్వహిస్తున్న పోలీసులు తమని తాము ఎలా రక్షించుకోవాలి అనే దానిపై దృష్టి పెట్టాడు. వారి కోసం ఫేస్ షీల్డులు తయారు చేయడానికి సమయాన్ని వెచ్చించాడు. 3డీ ప్రింటర్ ను ఉపయోగించి ఈ రక్షణ మాస్కులను తయారు చేస్తున్నాడు. ఇతరులతో మాట్లాడేటప్పుడు కరోనా బారిన పడకుండా ఫేస్ షీల్డ్ కాపాడుతుందని జారెబ్ తెలిపాడు.
నాన్న ఇచ్చిన పాకెట్ మనీతో 3డీ ప్రింటర్ కొనుగోలు చేసి తను చదువుకునే రూమ్ నే ఫేస్ షీల్డ్ తయారు చేయడానికి ఉపయోగించుకున్నాడు. ఈ 3డీ ప్రింటర్ యంత్రాన్ని ఉపయోగించి రోజుకి 10కి పైగా ఫేస్ షీల్డ్స్ తయారు చేయవచ్చని జారెబ్ చెబుతున్నాడు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎస్ శ్రీవాత్సవకు 100 ఫేస్ షీల్డులు తయారు చేసి ఉచితంగా అందించాడు. షీల్డ్ లతో పాటు వైరస్ నుంచి రక్షణ ఇచ్చే N-95మాస్కులను తయారు చేసే పనిలో ఉన్నానని తెలిపాడు. పోలీసులతో పాటు వైద్య సిబ్బందికీ ఈ మాస్కులను అందజేస్తానని జారెబ్ పేర్కొన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com