టీవీ సీరియల్ నటికి కరోనా..

నటీనటులు, రాజకీయ ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా హిందీ టీవీ నటి అదితి గుప్తా కరోనా బారిన పడ్డారు. పలు టెలివిజన్ సీరియల్స్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్న అదితి స్టార్ ప్లస్ లో ప్రసారమవుతున్న పాపులర్ షో ఇష్క్ బాజ్ లో ఉన్నారు. తనకు కరోనా వచ్చిన విషయాన్ని ఇన్ స్టాలో తెలియజేశారు. కరోనా సోకిందని తెలియగానే హోం క్వారంటైన్ లోకి వెళ్లానని భర్త, కుటుంబ సభ్యులు ధైర్యం చెబుతున్నారని అన్నారు. తగిన ఔషధాలు తీసుకుంటూ పాజిటివ్ ధోరణితో ఉంటున్నానని, తర్వలోనే కోలుకుంటానని తెలిపారు.

Recommended For You