పెట్రోల్ నుంచి వచ్చిన ఆదాయాన్ని ప్రజల ఆరోగ్యం పై వినియోగిస్తాం: కేంద్ర మంత్రి

గత కొన్ని రోజులుగా పెట్రోలు ధరలు పెరుగతుండటంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. దీనిపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ.. పెట్రోల్ పై వస్తున్న ఆధాయాన్ని ప్రజాసంక్షేమానికి వినియోగిస్తామని.. ముఖ్యంగా.. ప్రజల ఆరోగ్యానికి కేటాయిస్తామని అన్నారు. గడిచిన మూడు నెలల్లో 65వేల కోట్ల రూపాయలకుపైగా 4 కోట్ల మందికి బదిలీ చేశాం మేడం అని.. సోనియా గాంధీని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో పెట్రోల్ ధరలు పెరగటం కనిపిచడంలేదా అని ఆయన సోనియా గాంధీని ప్రశ్నించారు. కాగా, గడిచిన 22 రోజుల్లో పెట్రోల్ మీద 9.12 రూపాయలు, డీజిల్‌పై 11.01 రూపాయలు పెరిగిన విషయం తెలిసిందే.

Recommended For You