టిక్‌టాక్ పోయే.. చింగారి వచ్చె..

టిక్‌టాక్ పోయే.. చింగారి వచ్చె..

బెంగళూరుకు చెందిన బిస్వాత్మ నాయక్, సిద్దార్థ గౌతమ్ గత ఏడాది రూపొందించిన చింగారి యాప్ ను కన్నెత్తైనా చూడలేదు భారతీయులు. అందరూ చైనా సరుకు టిక్‌టాక్ ని డౌన్ లోడ్ చేసుకుని అందులోనే మునిగి తేలారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్ ని నిషేధించడంతో పాటు ప్లేస్టోర్ నుంచి కూడా తీసేయడంతో అలవాటు పడ్డ ప్రాణం అచ్చంగా అలాంటి దానికోసమే అన్వేషించింది. అంతలో చింగారి చేతికి చిక్కింది. ఇంకేముంది ఇప్పటికే 1 మిలియన్ మంది చింగారి యాప్ ని డౌన్ లోడ్ చేసేసుకున్నారు. గూగుల్ ప్లేస్టోర్ లో ఆ యాప్ అగ్రస్థానానికి చేరుకుంది.

షార్ట్ వీడియో సర్వీస్ తో అచ్చం టిక్‌టాక్ మాదిరిగానే ఉన్న ఈ యాప్ పై ప్రస్తుతం భారతీయులు మక్కువ చూపిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళం, తమిళం భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సైతం చింగారీ యాప్ ని డౌన్ లోడ్ చేసుకుని స్వదేశీ పరిఙ్ఞానంతో రూపొందిన చింగారి యాప్ ని ప్రోత్సహించాలని, యాప్ రూపకర్తలపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. చైనా యాప్ లను నిషేధం విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాలని చింగారి యాప్ సహ వ్యవస్థాపకుడు సుమిత్ ఘోష్ వ్యాఖ్యానించారు. టిక్‌టాక్ యాప్ బ్యాన్ చేసినందుకు సంతోషంగా ఉందని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story