ఆధునిక వైద్య సౌకర్యాలతో 108,104 వాహనాలు..

రాష్ట్ర ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించే విషయంలో భాగంగా 108,104 వాహనాలు రెండూ కలిపి 1088  అంబులెన్స్ లను  తీసుకు వచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టారు. ఆధునిక హంగులతో ఈ వాహనాలను సిద్ధం చేశారు. గతంలో సంవత్సరానికి 6,33,600 కేసుల్లో సేవలందించగా ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో ఏడాదికి 12 లక్షల మందికి సేవలందించేలా తీర్చిదిద్దారు. ప్రతి మొబైల్ మెడికల్ యూనిట్ లో ఒక వైద్య అధికారి, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్ ఉంటారు. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానమై పని చేసే ఎంఎంయూలు, ఇక నుంచి మారుమూల కుగ్రామాలలో సైతం శరవేగంగా వైద్య సేవలు అందించనున్నాయి.

రోగులకు అవసరమైన ఔషధాలను ఉచితంగా అంజేస్తారు. ప్రతి వాహనంలో ఆటోమేటిక్ వెహికల్ లొకేషన్ టాండ్ (ఏవీఎల్ టీ) తో పాటు, గ్లోబల్ పొజిషనింగ్ విధానం (జీపీఎస్) కూడా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో అయితే ఫోన్ చేసిన 15 నిమిషాల్లో వాహనం వస్తే, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో వచ్చేస్తుంది. ప్రతి అంబులెన్స్ ను ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ఈఆర్ సీ) తో అనుసంధానం చేశారు. దీంతో ఫోన్ చేసిన వారిని వేగంగా ట్రాక్ చేసే వీలు కలుగుతుంది. ప్రతి వాహనంలో ఒక కెమెరా, ఒక మొబైల్ డేటా టెర్మినల్ (ఎండీటీ) ఏర్పాటు చేశారు.

Recommended For You