వేలల్లో కొత్త కేసులు, వందల్లో మరణాలు.. యావత్ దేశాన్నే వణికిస్తున్న మహారాష్ట్ర

మహారాష్ట్రలో్ కరోనా ఆ రాష్ట్రాన్నే కాదు యావత్ దేశాన్ని వణికిస్తుంది. ప్రతీరోజు కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతూ.. అధికారులను,ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా.. 4,878 కేసులు.. 245 కరోనా మరణాలు సంభవించాయని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,74,761కి చేరగా.. మరణాల సంఖ్య 7,855కి చేరింది. అయితే వీరిలో 90,911మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా.. ఇంకా.. 75,979మంది చికిత్స పొందుతున్నారు. కరోనా రికవరీ రేటు ఎక్కువగా ఉండటం కాస్తా ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.

Recommended For You