గోవాలో ఓ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

గోవాలో బీజేపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయింది. దక్షిణ గోవాకు చెందిని ఎమ్మెల్యేకు కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్ అని తేలిదని వైద్యులు తెలిపారు. దీంతో ఆయనను ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. అటు, గోవాలో కరోనా కేసుల సంఖ్య 1198కి చేరింది. అటు, కరోనాతో ఇప్పటి వరకూ ముగ్గురు చనిపోయారని సీఎం తెలిపారు. ఇప్పటివరకూ 478 మంది కరోనా నుంచి కోలుకున్నారని అన్నారు. కాగా.. లాక్ డౌన్ సమయంలో కరోనా రహిత రాష్ట్రంగా గోవా ప్రకటించుకున్న విషయం తెలిసిందే. అయితే, మళ్లీ అక్కడ కరోనా విజృంభిస్తుంది.

Recommended For You