తమిళనాడు విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్

తమిళనాడు విద్యాశాఖ మంత్రికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్యులు తెలియజేశారు. మంత్రి అన్బలగన్ చైన్నై ఆస్పత్రిలో సీటీ స్కాన్ తీసుకున్నారని.. అయితే, దానికంటే ముందు కరోనా పరీక్షలకు స్వాబ్ నమూనాలు కూడా ఇచ్చారని తెలిపారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలిందని అన్నారు. మంత్రి అన్బలగన్ త్వరగా కోలుకోవాలని కేంద్రం మంత్ర రమేష్ కుమార్ పోఖ్రియాల్ ట్వీట్ చేశారు. మంత్రి అన్బలగన్ లో ఎలాంటి కరోనా లక్షణాలు లేవని.. ముందు జాగ్రత్తగా పరీక్షలు జరపగా.. పాజిటివ్ వచ్చిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని అన్నారు.

Recommended For You