ఏపీలో కొత్తగా 657 కేసులు.. ఆరుగురు మృతి

ఏపీలో కరోనా బులిటెన్ ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 657 కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపారు. అందులో 611 మంది ఏపీ ప్రజలుకాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 39 మంది.. విదేశాల నుంచి వచ్చిన వారు ఏడుగురు. ఒక్కరోజే కరోనాతో ఆరుగురు మృతి చెందారు. తాజగా నమోదైన కేసులతో కరోనా బాధితుల సంఖ్య 15,252కి చేరింది. వీరిలో 6988 మంది డిశ్చార్జ్ అవ్వగా.. 8071 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ 193 మంది కరోనా కాటుకు బలైపోయారు.

Recommended For You