భారత్‌లో కలవరపెడుతున్న కరోనా మరణాలు.. ఒక్కరోజే 570

భారత్‌లో కలవరపెడుతున్న కరోనా మరణాలు.. ఒక్కరోజే 570
X

దేశంలో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రతీ రోజు సుమారు 19వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 18,653 కొత్త కేసులు నమోదయ్యాయి. అటు, మరణాల సంఖ్య కూడా ప్రభుత్వ వర్గాలను కలవరపెడుతోంది. ఒక్కరోజులోనే 507 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 17400కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 5,85,493 మందికి కరోనా సోకగా.. అందులో 3,47,979మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 2,20,114 ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రతీ రోజు పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోవవుతున్నప్పటికీ.. రికవరీ రేటు ఎక్కువగా ఉండటం కాస్తా.. ఊరట కల్పిస్తుంది. కరోనా రికవరీ రేటు 59.43శాతం ఉంది.

Tags

Next Story