మా వాహనాల్లో చైనా పౌరులకు సేవలు బంద్: ఢిల్లీ టూర్స్ అండ్ ట్రావెల్స్

గాల్వాన్ ఘటన తరువాత దేశ వ్యాప్తంగా.. చైనా వస్తువులను బహిస్కరిస్తూ.. నిరసనలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ హోటల్ అసోషియేషన్ చైనా పౌరులకు తాము సేవలు అందించమని ఇటీవల ప్రకటించింది. అయితే, అదేబాటలో ఢిల్లీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ కూడా చైనా పౌరులకు తమ టాక్సీల్లో సేవలు అందించమని తెలిపింది. ఢిల్లీ టూర్ అండ్ టాక్సీ ట్రావెల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కమల్ చిబ్బర్ మాట్లాడుతూ, తమ టాక్సీలలో చైనీయులకు చోటు కల్పించలేమని అన్నారు. ఈ మేరకు తమ అసోసియేషన్ లో 500 మందిపైగా టాక్సీ ఆపరేటర్లు, ట్రావెల్ యజమానులు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. తమ వాహనాల్లో చైనా పౌరులకు సేవలు బంద్ అని నోటీసులు అతికిస్తామని కూడా చెప్పారు.

Recommended For You