మెంతి కూర అనుకుని గంజాయి తిన్న కుటుంబ సభ్యులు..

బావమరిది ఆటపట్టిందామని సరదాగా చేసిన పని.. ఓ కుటుంబాన్ని అనారోగ్యం పాలు చేసింది. ఓ కుర్రాడు గంజాయిని మెంతిపోడి అని చెప్పి.. తన బావ మరిదికి ఇచ్చాడు. ఆ విషయం తెలియక.. మెంతి కూర‌గా భావించి, గంజాయితో కూర వండుకుని తిన్నా కుంటుంబ సభ్యులు అనారోగ్యం పాలయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో చోటచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

కన్నౌజ్‌పరిధిలోని మియాగంజ్ గ్రామానికి చెందిన వ్యక్తి.. తన బావమరిదిని ఆటపట్టించాలనకున్నాడు. మెంతిపొడి ఇస్తున్న.. కూర వండుకుని తినండి అని గంజాయిని ఇచ్చాడు. దీంతో కూర‌చేసుకుని తిన్న అత‌ని కుటుంబ స‌భ్యులు.. ఒక్కొక్క‌రుగా స్పృహ‌త‌ప్పి ప‌డిపోయారు. స్థానికులు వెంట‌నే పోలీసుల‌కు ఈ స‌మాచారాన్ని అందించారు. సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు బాధితుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Recommended For You