కాపరికి కరోనా.. దీంతో ఆ గొర్రెలను..

కాపరికి కరోనా.. దీంతో ఆ గొర్రెలను..

జంతువుల నుంచి కరోనా రాదని పరిశోధనలు తేల్చినా కాపరికి పాజిటివ్ వచ్చేసరికి ముందు జాగ్రత్తగా గొర్రెలు, మేకలు అన్నింటినీ క్వారంటైన్ కు తరలించారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని గోడేకేరి గ్రామంలోని గొర్రెల కాపరికి పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే అతడు మేపిన గొర్రెలు కూడా శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. అదే విషయాన్ని తుమకూరు జిల్లా ఇన్ ఛార్జి, న్యాయ శాఖ మంత్రి జేసి మధుస్వామి దృష్టికి తీసుకువెళ్లారు. దర్యాప్తు జరపవలసిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు గొర్రెలు, మేకల నుంచి శాంపిల్స్ సేకరించి భోపాల్ లోని పరిశోధన శాలకు పంపించారు. తాజా సమాచారం మేరకు వాటికి కరోనా సోకలేదని తేలింది. అయినా ఎందుకైనా మంచిదని వాటిని కూడా క్వారంటైన్ కు తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story